Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరిత్రి సొసైటీ ఆధ్వర్యంలో వాకర్లకు అవగాహన
నవతెలంగాణ-బంజారాహిల్స్
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతున్నదని, ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని తగ్గించాలంటూ ధరిత్రి సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం కేబీఆర్ పార్కు వద్ద వాకర్లకు అవగాహన కలిగించారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కవర్ కన్నా ఎన్నిసార్లైనా వినియోగించే జ్యూట్ బ్యాగ్లు మిన్న అని వారు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన జ్యూట్ బ్యాగ్ తయారీదారులు వారు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. కార్యక్రమంలో జయసరిత, లక్ష్మి, చంద్రిక, ప్రియదర్శిని, చంద్రకళ, శ్రీలత, సాయిగీత, విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు.