Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమనీ, బస్తీలు, కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ దశల వారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు. ఆదివారం మల్కాజిగిరి డివిజన్ పరిధి లోని సీతారాం నగర్లో ఎమ్మెల్యే మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, డ్రయినేజీ, కమ్యూనిటీ హాల్, మంచినీరు, తదితర సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. సినీ పోలీస్ వెనకాల జరుగుతున్న బాక్స్ జాయిన్ పనులను, ఆనంద్ బాగ్‌లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. సీతారాం నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తులసి హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, జిఎన్‌వి సతీష్ కుమార్, నర్సింగ్ రావు, వినరు గౌడ్, సంధ్య, జయశ్రీ, సూరి, బాలకృష్ణ, పీఎస్ శ్రీనివాస్, గణేష్, సీతారాం నగర్ అసోసియేషన్ సభ్యులు వేణుగోపాల్, సంతోష్, రమేష్, శ్యామల, కిరణ్, శంకు పాల్గొన్నారు.