Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రముఖ సంపాదకులు, సుప్రసిద్ధ పాత్రికేయులు వరదాచారి పాత్రికేయరంగంలో చేసిన సేవలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు రమణాచారి అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వైదేహిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో బీఎస్ వరదాచారి జీవన సాఫల్య అభినందన సభను నిర్వహించారు. రమణాచారి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణతో కలిసి పాత్రికేయ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న వాస్తవాలను తన సంపాదకీయం ద్వారా ప్రజలకు చేరవేస్తు సమాజాన్ని చైతన్య పరిచిన వరద చారి సేవలు ఉన్నతమైనవన్నారు. ఆయన పాత్రికేయ వత్తి కోసం ఎంతో కషి చేశారని సమాచార శాఖ కమిషనర్‌గా పని చేసిన తనకు పాత్రికేయుకలతో మంచి అనుబంధం ఉందని వివరించారు. వరదాచారి సంపాదకీయంలో వాస్తవాలను నిర్మొహమాటంగా చెప్పే వ్యక్తి అని ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ కొనియాడారు. వరదాచారి నేటితరం పాత్రికేయులకు స్ఫూర్తిదాయకమని వయోదిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు దాసు కేశవరావు, ఆంధ్రజ్యోతి సంపాదకులు డాక్టర్ కే శ్రీనివాస్ చెప్పారు. తనను సత్కరించి అభినందించిన వారికి జీఎస్ వరదాచారి కృతజ్ఞతలు తెలిపారు.