Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కురువృద్ధుడు, సామాజికవేత్త మొహమ్మద్ యూసుఫ్ జానీ (జానీ బారు) సేవలు మరువలేనివి అని కాంగ్రెస్ నాయ కులు అన్నారు. ఆదివారం జానీ మృతి చెందారు. రామ్ గోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్న జానీ అయన మరణం విషయం తెలియ గానే పలువురు రాజకీయ నాయకులు పలువురు ప్రముఖులు జానీ బారు నివాసానికి చేరుకుని నివాళి అర్పించారు. జానీ బారు సేవలు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శీలం రాందాస్ సనత్నగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన సమయంలో ప్రధాన కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలు మరువలేనివని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తన నివాసం వచ్చి పూలమాలలు సమర్పించి ఆయన మృతి పట్ల బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇచ్చారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన ఇంటికి సంతాపం తెలిపారు. ఆయన మృతి చెందడం నల్లగుట్ట ప్రాంతానికి విడదీయని ఆయన కొనియా డారు అనంతరం జానీ బారు అంతక్రియల్లో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, స్థానిక మాజీ కార్పొరేటర్ శీలం ప్రభాకర్, రామ్ గోపాల్ పేట డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు దయానంద్, సనత్ నగర్ నియోజకవర్గం లోని ఆయన అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.