Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- అభివృద్ధి పనుల పరిశీలన
నవతెలంగాణ-బేగంపేట్
తెలంగాణ పండగలకు విశ్వవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేటలో గల శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను, తన వ్యక్తిగత నిధులతో నిర్మిస్తున్న 2 ఆలయ ముఖ ద్వారాల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించిన అనంతరం మాట్లాడు తూ తెలంగాణ సంస్కతికి బోనాలు ప్రతీకగా నిలుస్తా యన్నారు. జులై 17వ తేదీన ఉజ్జయిని మహంకాళి బోనాలు, 18న రంగం జరుగుతాయని తెలిపారు. సికింద్రాబాద్ బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనం, బోనాలు సమర్పించేందుకు లక్షలాది మంది వస్తారనీ, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి అధికారికంగా నిర్వహి స్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. మంత్రి వెంట ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, ఏసీపీ రమేష్, మహకంకాళి ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.