Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోనీ జూబ్లీహిల్స్ డివిజన్ ఫిల్మ్ బస్తీలో కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ కో-ఆర్డినేటర్ డాక్టర్ సి.రోహిన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు కాటూరి రమేష్, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి బస్తీవాసుల సమస్యలను తెలుసుకున్నారు. వివేకాందనగర్, బసవతారకనగర్ మధ్యలో ఉన్న డంప్ యార్డు బస్తీ వాసులకు తీవ్ర సమస్యగా ఉందని మహిళలు తెలిపారు. చిన్న చిన్న పిల్లలు స్కూల్‌కి వెళ్ళడానికి దారి సరిగా లేక కిందపడి గాయాలపాలు అవుతున్నారని తెలిపారు. విపరీతమైన దోమలు, ఈగలు వల్ల డెంగీ, మలేరియాతో హాస్పిటల్ పాలై మృతి చెందిన సందర్భాలూ ఉన్నాయని చెబుతూ కంటతడి పెట్టడంతో వారి అధ్వాన్న పరిస్థితిని చూసి మున్సిపల్ అధికారులతో రోహన్ రెడ్డి మాట్లాడారు. సమస్యను పరిష్కరించకుంటే బస్తీ వాసులతో కలిసి మున్సిపల్ ఆఫీస్‌ను ముట్టడిస్తమని అధికారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా బస్తీవాసులతో మాట్లాడుతూ అవసరమైతే ప్రభుత్వానికి అధికారులకు చలనం వచ్చేంత వరకు నిరాహార దీక్ష చేసైనా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు.