Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
విభిన్న రుచులు కోరుకునే నగర వాసుల కోసం మరో కొత్త రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. కేపీహెచ్‌బీలోని గోకుల్ ఫ్లాట్స్‌లో దక్షిణ్ విందు పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ను ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేకానంద, గంటా శ్రీనివాస రావు, జయేష్ రంజన్ ప్రారంభించారు. ''దక్షిణ్ విందు'' అనేది 8000 చదరపు అడుగుల విస్తీ ర్ణంలో విస్తరించి ఉన్న దక్షిణ భారతీయ తీరప్రాంత రుచికర మైన పదార్థాలు, సమ్మేళనాలను అందుబాటులోకి తీసుకొ చ్చింది. హైదరాబాద్ నగరం అభివృద్ధిలో గోకుల్ ప్లాట్లు, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్‌లో ఇక్కడ జనాభా సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. వారందరికీ అందుబాటులో ఉంటూ వారికి ''దక్షిణ్ విందు'' దక్షిణ టిఫిన్, నెల్లూరు థాలీ, దక్షిణ్ మంచిని అందించేందుకు సిద్దమైంది. పుట్టిన రోజు, కిట్టి పార్టీ, సమావేశాలు, టేక్ అవే, ఎగ్జిక్యూటివ్ లంచ్, క్యాటరింగ్ కోసం హాళ్లను సులభతరం చేసేందుకు దక్షిణ్ విందు సరైన వేదిక. ''దక్షిణ్ విందు''కి సంప్రదాయ దక్షిణ భారత విలేజ్ కోస్టల్ డెలికేసీల వినూత్న మిశ్ర మాలను అందించడంలో నైపుణ్యం ఉంది. దక్షిణ టిఫిన్స్, నెల్లూరు థాలీ, దక్షిణ్ మండి వంటకాలను అందిస్తున్నట్టు నిర్వహకులు భాస్కర్, రాజ తెలిపారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలతోపాటు స్పెషల్ డేస్‌లో ప్రత్యేక డిసెస్ను అందుబాటులో ఉంచుతామన్నారు. భోజన ప్రియుల కోసం ఐదు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వంటకాలు ఒకే చోటు లభిస్తాయని తెలిపారు. ''దక్షిణ్ విందు'' ఎన్ఐటీ-వరంగల్, బీఐటీఎస్- పిలానీ ఇంజినీర్లు ప్రమోట్ చేయబడింది. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేక్, గంటా శ్రీనివాస రావు, తెలంగాణ ఐటీశాఖ కార్య దర్శి జయేష్ రంజన్, సినీ నటుడు సాయి కుమార్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, సినీ నటి సుహాసిని, చాందిని, డైరెక్టర్ బి.గోపాల్, కోదండరామిరెడ్డి, విజరు టెలివిజన్ నటి నటులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.