Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్ మెట్
బీజేపీ మతోన్మాద, టీఆర్ఎస్ నియంతృత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా పోరా టాలను ఉధృతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యద ర్శివర్గ సభ్యులు ఎన్. బాలమల్లేష్ పేర్కొన్నారు. యాప్రాల్ మల్లన్న ఆలయ ఆవరణలో డి.జంగయ్య అధ్యక్షతన జరిగిన యాప్రాల్ శాఖ మహాసభలో బాల మల్లేష్ మాట్లాడారు. దేశంలో మతోన్మాదన్ని పెంచి పోసిస్తున్న బీజేపీ ఆటలు కట్టించాలనానరు. మోడీ ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగ అవకా శాలు కల్పిస్తామని చెప్పి కల్పించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అగ్నిపథ్ ప్రవేశ పెట్టి భారత సైన్యంలో ప్రయివేటీ కరణ చేసి దేశ భద్రతకు భంగం కలిగిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నేర వేర్చలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హత గల పేదలందరికీ ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలని డిమా ండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డీజి సాయిలు గౌడ్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ కార్యకర్తలు సైనికులుగా పని చేయాల న్నారు. పేదల ఇండ్ల స్థలాలు, నిరుద్యోగులకు ఉపా ధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ సమా వేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రొయ్యల కృష్ణమూర్తి, తోటపల్లి శంకర్, అల్వాల్ పట్టణ కార్య దర్శి సహదేవ్, సహాయ కార్యదర్శి జంగయ్య, మహిళా సమాఖ్య నాయకురాలు సంతోషి, పద్మ, రఘు, రవి, వెంకటేష్, సల్మాన్ బేగ్ పాల్గొన్నారు.
యాప్రాల్ సీపీఐ శాఖ కార్యదర్శిగా వెంకటేష్
యాప్రాల్ సీపీఐ శాఖ కార్యదర్శిగా వై.వెంకటే ష్, సహాయ కార్యదర్శిగా ఆర్.రఘు, కోశాధికారిగా విజరు రెడ్డితో పాటు 21 మందితో కూడిన కమిటీని ఎన్నుకున్నారు.