Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఏ ఆధారం లేని అనాథ విద్యార్థులను చేర దీసి, వారికి ప్రతి నెలా కావాల్సిన విద్యావసరాలు, నిత్యావసర వస్తువు లను అందిస్తూ వారి చదువుకు ఎలాంటి ఆటంకం కలగ కుండా ఆసరాగా నిలుస్తున్న సహారా సేవా సంస్థ ఆధ్వ ర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో భాగంగా అనాథ, పేద బాల బాలికలకు నోట్ బుక్స్, పెన్నులు తదితర విద్యావసర వస్తువులతో బాటు నిత్యవసరాలైన బియ్యం, పప్పు, సబ్బులు, నునె, పంచదార, రవ్వ , బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంఆనికి ముఖ్య అథితిగా సోషల్ యాక్టివిస్ట్ హిమ బిందు హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తాను సాధించాల్సిన ధ్యేయం చేరుకోవడానికి, పేద, బీద అనాథ అనే తేడా లేకుండా అందరూ చదువుకున్న నాడే తాము అనుకున్నది సాధించడమే కాకుండా దేశ అభివృద్ధికి తోడ్పడగలరని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహారా సంస్థ డైరెక్టర్ ఆర్.నరసింగరావు అధ్యక్షత వహించి విద్యా, నిత్యావసర వస్తువులను అందించి విద్యార్థులను బాగా చదవాలని ప్రోచాహించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ శ్రీహర్ష, కౌశిక్, స్వీకర్ పాల్గొన్నారు.