Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఇటీవల నగరంలో జరిగిన పర్ఫెక్ట్ 360 వారు నిర్వహించిన అవార్డుల వేడుకలో త్రినాధ్ రవికుమారన్కు ఎమినెంట్ అవార్డు-2022 దక్కింది. సినిమా, ఫ్యాషనేతర వినోద రంగాల్లో అలరిస్తున్న ప్రముఖులు, ఇన్ఫ్లుఎంసెర్స్, సోషల్ మీడియా తారలకు నిరంతరం తమ అభిమా నులకు చేరువలో ఉండాలీ, విభిన్న కొత్త పోకడలను అనుకరించి ఆకట్టుకోవాలనే తాపత్రయం ఎక్కువే. బహుశా అందుకే ప్రచారర్థక సహాయకులను, అంతర్జాల మార్కెటింగ్ నిపుణులను, ప్రజా సంబంధాల సేవకులను చాలా మొత్తం డబ్బు చెల్లించి తమ స్వీయ ప్రచారాలకు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ మొత్తం సేవలను కేవలం అగ్రగణ్యులకు మాత్రమే కాకుండా అప్పుడే పైకి వస్తున యువతరానికి, నూతన ఉత్తేజకులకు, ఔత్సాహి కులకు కూడా ఒకే కంపెనీ అందించగల్గితే, ఆ వెసులుబాటే అతిపెద్ద స్వాంతన. అలాంటి సేవలను సెలెబ్రెటీలకు సమకూరుస్తున్న వారి గురించే ఈ కథాంశం. సెలబ్రిటీ వింగ్స్ కంపెనీ హైదరాబాద్లో స్థాపించబడి బ్రాండ్ కొల్లబోరేషన్స్, మూవీ ప్రోమోషన్స్ సేవలను పలువురు తారలకు, వినోదరంగ ప్రముఖులకు అత్యంత క్రియాశీల కంగా అందిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీత్రినాధ్ రవికు మారన్ ఈ కంపెనీని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి ఇప్పటికే దేశవ్యాప్తంగా యాభైవేల ఇన్ఫ్లుయెన్సుర్స్, ఐదువే లకుపైగా సెలెబ్రెటీల ప్రజా సంబంధాలు (పబ్లిక్ రిలేషన్స్), ప్రచార కార్యక్రమాలకు పని చేస్తున్నారు. రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన ఈ నిపుణుల బృందం ఇప్పటిదాకా 450కి పైగా బ్రాండ్ కొల్లబోరేషన్స్ సాధించి, 52 సినిమాలకు ప్రచార కార్యక్రమాలను రూపొందించారు. దాదాపు 400 మందికిపైగా వినియోగదారులు ఈ సెలబ్రిటీ వింగ్స్ సేవలను విస్తతంగా ప్రశంసించారు. మరిన్ని ఏండ్లు వారి సేవలు కొనసాగించేలా ఒప్పందాలు చేసుకున్నారు.