Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
అగ్నిపథ్‌ను ఉపసంహరించుకోవాలని కోరుతూ మల్కాజిగిరిలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు పీసీసీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో కలసి సోమశేఖర్ రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ నల్ల చట్టాల తర్వాత కేంద్ర ప్రభుత్వం అనాలోచిత ప్రమాదకరమైన పథకమని అగ్నిపథ్ పథకం తీసుకువచ్చి యువతను నిర్వీర్యం చేస్తుందన్నారు. వ్యవసాయ నల్ల చట్టాల ప్రకటనతో రైతులను బలిగొన్న కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఆర్మీ విద్యార్థుల భవిష్యత్తును అగ్నిపథ్ పథకంతో అంధకారం చేసిందన్నారు. అగ్నిపథ్ పథకంపై తమ వైఖరిని స్పష్టం చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కుటిల రాజకీయం చేస్తుందని విమర్శించారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసి రెగ్యులర్ రిక్రూట్మెంట్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మోడల్ ఎగ్జామ్ కోడ్‌ను వర్తింపజేయడం ద్వారా అన్ని ఆర్మీ ఖాళీలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మూడేండ్లుగా రిక్రూట్మెంట్ లేని కారణంగా వయస్సు దాటిన యువతకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసారు.