Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
మారేడ్‌పల్లిలోని పుష్పగిరి కంటి హాస్పిటల్ ఆవరణలో రూ.50 లక్షలతో రూపొందించిన మొబైల్ కంటి పరీక్ష వాహనాన్ని సోమవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్పగిరి హాస్పిటల్లో ఉచితంగాకి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారనీ, కంటి పరీక్ష లు, ఆపరేషన్లు నిర్వహించడమే కాకుండా మందులు కూడా అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు నూత నంగా కంటి పరీక్షల వాహనాన్ని ప్రారంభించడం చాల సంతోషించదగ్గ విషయం అన్నారు. ప్రతిరోజూ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ వాహనం తిరుగుతూ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తుందని నిర్వహకులు మంత్రికి తెలిపారు. ఉచిత శిబిరాలు నిర్వహిస్తూ అవస రమైన వారికి, మందులు, కళ్ళద్దాలను ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. ఈ వాహనంలో ముగ్గురు టెక్నిషియన్లు, ఇద్దరు కో-ఆర్డినేటర్లు, ఒక డ్రైవర్ ఉంటారని తెలిపారు. ఈ వాహనాన్ని ప్రారంభించ డానికి గల ముఖ్య కారణం హై వే రహదారుల వెంట ఉచితంగా పరీక్ష శిబిరాలు ఏర్పాటు చేసి లారీ, ట్రక్ డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి కంటి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిం చడం జరుగుతుందని చెప్పారు. అత్యధిక ప్రమాదాలు చోటు చేసుకోకుండా నివారించాలనేది ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పుష్పగిరి హాస్పిటల్ చైర్మన్ గోవింద్ హరి, డిప్యూటీ చైర్మన్ విశాల్, ప్రాజెక్ట్ డైరెక్టర్ విజరు కిరణ్, అనిల్ రెడ్డి, రాఘవన్, తదితరులు పాల్గొన్నారు.