Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనుల పరిశీలన
నవతెలంగాణ-బేగంపేట్
చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొ చ్చేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఎంజీ రోడ్డులో గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు, బన్సీలాల్ పేటలోని పురాతన మెట్ల బావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. మెట్ల బావి చుట్టూ తిరిగి పనులను పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలను వేరొక చోటకు తరలించాలని ఆదేశిం చారు. రోడ్డు నిర్మాణంకు ముందే వాటర్, సీవరేజ్ లైన్ పనులు ఉంటే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నగరంలోని మెట్ల బావులు అన్ని పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. మెట్ల బావి పరిసరాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతామనీ, పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తున్నా మని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్ట్లు పేర్కొన్నా రు. చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే పురాతన నిర్మాణాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తుందని తెలిపారు. మహాత్మాగాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను కూడా ఆగస్టు 15 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణతో పని చేస్తున్నట్టు తెలిపారు. మంత్రి వెంట కార్పొరేటర్ హేమలత, మాజీ కార్పొరేటర్ అత్తి లి అరుణ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ముకుం ద రెడ్డి, సుదర్శన్, మెట్ల బావి పునరుద్ధరణ పనుల పర్యవేక్షకులు కల్పన, ఎలెక్ట్రికల్ శ్రీధర్, వాటర్ వర్క్స్ రమణారెడ్డి, టౌన్ ప్లానింగ్ క్రిస్టోఫర్ ఉన్నారు.