Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
జిల్లా వ్యాప్తంగా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) లింగ్యానాయక్ అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో నిర్వహిం చారు. ఈ మేరకు ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 62 మంది తమ వినతులను, సమ స్యలను, దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్ర మంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.