Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకేసారి 30 మందికి కుక్క కాటు
- భయాందోళనలో ఆయా కాలనీల ప్రజలు
నవతెలంగాణ-నేరెడ్ మెట్
అల్వాల్ సర్కిల్లో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇటీవల ఇంటి బయట ఆడుతున్న మూడున్నరేండ్ల బాబును కుక్క కరిచింది. అతి దారుణంగా మొహాన్ని చీల్చింది. ఒక ముక్క కుక్క దగ్గరే ఉండి పోయింది. అప్రమత్తమైన కాలనీ వాసులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు నాలుగు గంటలు చికిత్స చేసిన అనంతరం ప్రాణాలతో బయటపడ్డాడు. అదే కుక్క దాదాపుగా 30 మందికి పైగా కరిచినట్టు సమాచారం. అల్వాల్ సర్కిల్లో కుక్కల బెడద ఎక్కువ కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ ప్రెసిడెన్సీ కాలనీలో కుక్కలు సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు కాలనీ అపార్టుమెంటులు, ఇండ్లు, పార్కుల చుట్టూ సంచరిస్తున్నాయి. కాలనీ వారు చుట్టు పక్కల కాలనీ వారు ఉదయం వాకింగ్ చేస్తుండగా ఏకధాటిగా దొరికన వారిని దొరికినట్టు కరిచింది. ఒక్క కాలనీ నుంచి 15 మందిని కరవగా మరో 15,16 మంది వాకర్స్‌ని కరిచింది. ఇక అదే కాలనీకి చెందిన బాబు బయట ఆడుకుంటున్న సమయంలో చెంప మొత్తం కరవడంతో ఒక ముక్క కుక్క వద్దనే ఉండి పోయింది. బాబుని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. మొదటిసారిగా ఇంత మందిని ఏకధాటిగా కరవడంతో కాలనీ వాసులంతా భయభ్రాంతులకు గురయ్యారు.
30 మందిని కరిచింది
నర్రా శ్రీనివాస్, ప్రెసిడెన్సీ కాలనీ ప్రధాన కార్యదర్శి
పసి బాబునే కాకుండా, దాదాపు 30 మందిని అక్కడ ఉన్న కుక్కలు కరిచాయి. మా కాలనీ వారిని 15 మందిని కరిచినట్టు గుర్తించాం. చుట్టుపక్కల కాలనీకి చెందిన 15,16 మందిని కరిచింది. మేం వెంటనే కార్పొ రేటర్కు కాల్ చేశాం. కార్పొరేటర్ వెంటనే డా.మనోజ్‌ని పంపారు. తాను తన సిబ్బందితో వచ్చి కరిచిన కుక్కను తీసుకుకెళ్లారు. మరుసటి రోజు కాలనీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసాం. తీవ్రంగా గాయపడిన బాబుకు చికిత్స నిమిత్తం సానుభూతితో తలా కొంత డబ్బులు జమ చేసి ఇవ్వాలని నిర్ణయించాం.
కరిచిన కుక్కను పట్టుకున్నాం
డా.మనోజ్, వెటర్నిటీ, అల్వాల్
కరిచిన కుక్కను అదుపులోకి తీసుకున్నాం. మరో 20 నుంచి 22 కుక్కలను పట్టుకున్నాం. వాటికి యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ చేసి అబ్సర్వేషన్లో ఉంచాం. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ లేని కుక్కలకు ఆపరేషన్ చేస్తాం. ఐదు రోజులు అబ్సర్వేషన్లో ఉంచు తాం. ఏదైనా వేరే కుక్క సింటమ్స్ లాగా ఉంటే మా దగ్గర ఉంచుకుని ట్రీట్మెంట్ చేస్తాం.
ఎప్పుడూ ఇలాంటి ఘటన జరుగలేదు
రాజ్ జితేందర్ నాథ్, మచ్చబొల్లారం డివిజన్ కార్పొరేటర్
మా దగ్గర ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. ఇదే మొదటి సారి. ఉదయం నాకు కాల్ చేశారు. సాయంత్రం వేళ పిచ్చి కుక్క తిరుగుతుందని డిప్యూటీ డైరెక్టర్ విల్సన్‌కి కాల్ చేశాను. ఆయన కూకట్పల్లి, శేరిలింగంపల్లిలో వర్క్ చేస్తున్నారని తెలిసింది. తన దగ్గర వేటర్నిటీ డాక్టర్‌గా పని చేస్తున్న మనోజ్‌ను పంపించారు. కాలనీ వారితో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిం చాను. 15, 20 నిమిషాల్లో వారిని పంపించాను. అప్పటికే అందరినీ కరుస్తూ ఉందట. కరిచిన వారంద రికీ యాంటీ రేబిస్ ఇంజక్షన్ వేయించాం. కాలనీ వారి మీటింగ్ తర్వాత నాతో కాన్ఫ్‌రెన్స్‌లో మాట్లాడారు.
అల్వాల్‌లో కుక్కలు ఎక్కువ అయ్యాయి
డిప్యూటీ కమిషనర్ నాగమణి, అల్వాల్
అల్వాల్‌లో కుక్కలు ఎక్కువ అయ్యాయి. కొన్ని కాలనీల్లో కరుస్తున్నాయి అని కంప్లైంట్ రాగానే వేటర్ని టీ డాక్టర్ మనోజ్‌కి క్లియర్ చేయమని ఆదేశాలు ఇచ్చా ం. కొన్ని కుక్కలను పట్టుకున్నారు. వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి అబ్సర్వేషన్లో ఉంచాం.