Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
బోయిన్పల్లి డివిజన్లో సోమవారం కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం యాదవ్ కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశారు. బృందావన్ కాలనీలో ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. ఎల్బీనగర్ అంజయ్య నగర్ దుబారు గేట్ ప్రాంతాల్లో అభివృద్ధి మురికి కాల్వలు, రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు డివిజన్లో దళితబంధు ద్వారా మంజూరైన కార్లను డీసీఎంలను లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర గౌడ్, మక్కల నర్సింగ్ రావు, లావణ్య, డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, జనరల్ సెక్రెటరీ మేకల హరనాథ్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.