Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్ మెట్
రోడ్డుపై ర్యాంపులు వేస్తున్నారంటూ జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందడంతో గతంలో కూల్చేశారు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ ర్యాంపు వేసారు ఓ డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి. గతంలో కాలనీ వారంతా కలిసి ర్యాంపుల విష యమై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ ర్యాంపును తొలగించారు. మళ్లీ ఇప్పుడు ర్యాంపు వేశారు. ఓల్డ్ అల్వాల్ మచ్చబొల్లారం డివిజన్ సూర్యన గర్లో 25 ఫీట్ల రోడ్డు ఉంటే 8 నుంచి 10 ఫీట్ల వరకు రోడ్డు కబ్జా చేసి ఓ పోలీసు అధికారి ర్యాంపు వేశారు. లోపల నుంచి నిర్మిం చుకోవాలనీ, వాహనాలు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని కాలనీ వారు గతంలో హెచ్చరించారు. అయినా వినకుండా ర్యాంపు వేయడంతో జీహెచ్ఎంసీ అధి కారులకు కాలనీవా సులు ఫిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ నెల 18వ తేదీన ర్యాంపు తొలగించారు. ఇప్పుడు మళ్లీ ర్యాంపు వేశారు. పోలీసులు అధికారి అంటూ ర్యాంపు వేయడం ఎంత వరకు సమంజసం అని కాలనీ వారు ప్రశ్నిస్తున్నారు.
చెప్పినా వినడం లేదు
కేబి నాగమయ్య, సూర్య నగర్ ఫేజ్-1 ప్రెసిడెంట్
మేం గతంలో కూడా చెప్పాం. అయినా వినకుండా ర్యాంపు వేశారు. జీహెచ్ఎంసీ అధికారులకు కంప్లైంట్ ఇచ్చాం. వారు వచ్చి తీసేసారు. మళ్ళీ వేశారు. పోలీసు అని ఎవరు అడగరు అనుకున్నారా..? ఇక్కడ అందరికీ కార్లు ఉన్నాయి. అతను ర్యాంపు వేయడమే కాకుండా రోడ్డు అవతల కారు పార్క్ చేస్తున్నాడు. ఈ రోడ్డున పోయే వాహనాలకు చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్ రోడ్డు మీద ఉన్న ర్యాంపులు అన్నీ తొలగించాలి.
రోడ్డు మీద ఉన్న ర్యాంపులన్నీ తీసేయాలి
నరసింహం, కాలనీ సెక్రటరీ
రోడ్డు మీద ఉన్న ర్యాంపులన్నీ తీసేయాలి. వాహనాలు పోకుండా రోడ్డు ఇరుకు అయింది. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. పోలీసు అధికారి అయితే ర్యాంపు రోడ్డు మీద వేయాలని రూల్ లేదు కదా.