Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
బోయినపల్లి క్రీడామైదానంలో మూడు రోజుల పాటు జరిగిన స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఎంపీ అరిగే రామస్వామి మెమోరియల్ ఫుట్ బాల్ టోర్నమెంట్లో యాప్రాల్ విన్నెర్స్ అయ్యింది. రన్నర్స్‌కు కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఛైర్మెన్ జంపన ప్రతాప్, ఆర్మ్స్ ఫౌండేషన్ ఛైర్మెన్ అరిగే మధు సూదన్ సంయుక్త ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు అందజేశారు. జాతీయ ఫుట్ బాల్ జట్టు క్రీడాకారులు, మాజీ క్రీడాకారులను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందచేశారు. కోచ్ యస్సాదాని, డీజీ జగదీష్, మూసా లతీఫ్, అన్వార్, ఖైజార్, సయెద్ ఖలీమ్ ఉల్లహ, బషీర్, వివేక్, అమూల్ రాజ్, బీఆర్. వివేకానంద్, రమేష్, జ్ఞానేశ్వర్, అక్తర్, సమద్, ఆంథోనీ ఎడ్వర్డ్ ఉన్నారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ ఫుట్ బాల్ క్రీడాకారులను సన్మానిం చడం అదృష్టమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సత్యనారాయణ స్టాన్లీ, జైరాజ్, మునిరాజ్, వరప్రసాద్, మహేందర్, పవన్ పాల్గొన్నారు.