Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అల్లాపూర్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్
నవతెలంగాణ-కేపీహెచ్బీ
అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని శ్రీవివేకానంద నగర్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, రాజీవ్ గాంధీ నగర్ లో పైప్ లైన్ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న ప్రహారీగోడ పనులను, సబ్దర్ నగర్ లో భూగర్భ డ్రయినేజీ పనులను పరిశీలించారు. అనంతరం పర్వత్ నగర్లో భూగర్భ డ్రయినేజి పొంగి దుర్గంధ వాసనతో భరించలేక పోతున్నామని స్థానికులు ఆమె దష్టికి తీసుకవచ్చారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షులు జాహెద్ షరీఫ్ బాబా, సయ్యిద్ రియాజ్, అబ్దుల్ హమీద్, రవీందర్ రెడ్డి, ఇస్మాయిల్, భద్రునాయక్, యాలాల రాముయాదవ్, సలీం, అస్లాం, సలావుద్దీన్, సంబు, గణపతి, రఫీక్, సుజాత, తదితరులు పాల్గొన్నారు.