Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ నిర్మలా ప్రభావతి
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో కుష్ఠు రోగులను వికలాంగులుగా పరిగణించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సదరన్ క్యాంటీన్‌ను నిర్వహించారు. కోవిడ్ అనంతరం మెట్టమొదటి సారిగా సదరన్ క్యాంపు తిరిగి ప్రారంభించామని జిల్లా వైద్యాధికారి, లెప్రసీ డా.నిర్మలా ప్రభావతి తెలిపారు. కాళ్లు, చేతులు లేనివారిని మాత్రమే మనం వికలాంగులుగా పరిగణిస్తాం కాని లెప్రసీ రోగులు కూడా వికలాంగులే అనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. లెప్రసీ రోగుల్లో చర్మానికి స్పర్శ ఉండదని అన్నారు. దీని వల్ల వారు అనేక ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన చెందారు. లెప్రసీలో 40% పైగా వైకల్యం ఉంటే వారిని వికలాంగులుగా గుర్తిస్తామని తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో లెప్రసీ రోగులు దాదాపు 300 మంది చికిత్స పొందిన వారు ఉన్నారన్నారు. వీరిలో ప్రతి సోమవారం 30 మంది చొప్పున పరీక్షలు జరిపి సర్టిఫికెట్స్ జారీ చేస్తామని వెల్లడించారు. సోమవారం జరిపిన పరీక్షలో 26 మంది రోగులకు సదరన్ సర్టిఫికెట్స్ జారీచేశామని తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ ఆర్ఎంఓ డా.మల్లిఖార్జున్, సదరన్ అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శైలజ. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్. జలజ, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శివ, డాక్టర్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు.