Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ పారిజాత నర్సింహారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేస్తుందని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం బడంగ్పేట్ 22వ డివిజన్లోని శివ నారాయణ పురం, సాయి ప్రభు కాలనీల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ లిక్కి మమత కష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం కాలనీలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అదేశంతో ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కరోనా మళ్లీ విజంభిస్తున్న నేపథ్యంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో డీఈఈ అశోక్ రెడ్డి, ఏఈఈ రాంప్రసాద్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు కష్ణ సాగర్, వన్ సఫర్, అశోక్, సీమా ప్రేమ్ కుమార్, శ్రీనివాస్, అరవింద్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.