Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళాభరణం కష్ణమోహన రావు
నవతెలంగాణ-కల్చరల్
ఆర్థిక సంస్కరణలతో పాటు సమాజిక అంతరాలు, అసమానతలు లేని సమాజం కోసం ఏ పదవిలో ఉన్నా కషిచేసిన పీవీ నరసింహారావు పాలనా రంగాల వారికి ఆదర్శ ప్రాయులని బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళ భరణం కష్ణమోహన రావు అన్నారు. శీత్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై గానసభ నిర్వహణలో దేశ పూర్వ ప్రధాని పీ.వీ.నరసింహారావు శత జయంతి సమావేశం జరిగింది.డాక్టర్ కష్ణమోహన రావు పాల్గొని మాట్లాడుతూ మౌన ముద్రతోనే పలు సమస్యలను పరిష్కరించిన మేధావి పీవీ అని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూ సంస్కరణలు వంటి విప్లవాత్మక నిర్ణయాల ఫలితాలు నేటికి అనుభవంలో ఉన్నాయని వివరించారు. గాన సభ అధ్యక్షుడు కళా జనార్దన ముర్తి అధ్యక్షత వహించిన సభలో సాహితీకిరణం సంపాదకుడు పొత్తూరి సుబ్బారావు, గాయకులు త్రినాధ్ర రావు, సుబ్రహ్మణ్యం, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.