Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కె.యేసురత్నం, మండల సీపీఐ కార్యదర్శి ఉమామహేష్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
హెచ్ఎంటీ ఖాళీ స్థలంలో బస్ డిపో ఏర్పాటు అయ్యేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కె.యేసురత్నం, కుత్బుల్లాపూర్ మండల సీపీఐ కార్యదర్శి ఉమామహేష్ అన్నారు. మంగళవారం జగద్గిరిగుట్ట చివరి బస్టాప్‌లో జగద్గిరిగుట్ట సీపీఐ శాఖ కార్యదర్శి సహదేవ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ఏంటీ ఖాళీ స్థలంలో హెచ్ఎండీఏ వారు ప్లాట్లుగా చేసుకొని డబ్బులు సంపాదించడానికి పనిచేస్తున్నాయే తప్ప 15 సంవత్సరాలుగా ప్రజల కోరుతున్న బస్ డిపోను మాత్రం ఏర్పాటు చేస్తాలేరని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కోసమైనా బస్ డిపో ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో బస్ డిపో ఏర్పాటు అయ్యేంత వరకు నిరసన, పోరాటం నిరంతరం నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు హరినాథ్, సీపీఐ సీనియర్ నాయకులు వెంకటేశ్, సీపీఐ స్థానిక నాయకులు రాజు, చంద్రయ్య, ఇమామ్, లక్ష్మణ్, రఘు, ఆరిఫ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.