Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
చెడు వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను నార్త్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సెల్‌ఫోన్, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం టాస్క్ఫోర్సు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం...లోతుకుంటకు చెందిన సాయి సంతోష్, సికింద్రాబాద్‌కు చెందిన కె.శశాంక్, అల్వాల్‌కు చెందిన ఎస్.తరుణ్ కుమార్‌లు స్నేహితులు. చెడు వ్యసనాలకు బానిసైన ఈ ముగ్గురు మద్యం సేవించడంతోపాటు సిగరేట్లు తాగేవారు. జల్సాతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దాంతో సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్న నిందితులు సెల్ఫోన్లపై దృష్టి సారించారు. నడుచుకుంటూ లేదా వాహనాలపై సెల్ఫోన్లో మాట్లాడుతూ.. వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకునేవారు. నిందితులు మరో ద్విచక్రవాహనంపై వారిని ఫాలో అవుతారు. ఆ తర్వాత అదును చూసుకుని వారి సెల్‌ఫోన్‌ను లాక్కెళ్తారు. ఇదే తరహాలో గత నెల 10న కార్ఖానా పోలీస్‌స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ మహిళను టార్గెట్ చేశారు. ద్విచక్రవాహనంపై అమెను వెంబడించిన నిందితులు ఆమె చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్ ఎం.ప్రవీణ్‌కుమార్ అన్నికోణాల్లో విచారించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడుల్లో ఎస్ఐలు కె.శ్రీకాంత్, బి.అరవిండ్ గౌడ్, ఎం.అనంతచారీ, బి.అశోక్ రెడ్డి పాల్గొన్నారు.