Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
నాలా పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం ఆంబర్పేట డివిజన్ ప్రేమ్‌నగర్‌లో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్‌గౌడ్, వివిధ శాఖల అధికారులతో కలిసి పాదయాత్ర చేపట్టి నాలా పూడికతీత పనులు, నాలా అభివద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమ్‌నగర్ నాలా పూడికతీత పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నాలా అభివద్ధి పనులను, రెయిన్ వాటర్ వెళ్లే ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఈలు శంకర్, డీఈ సుధాకర్, సువర్ణ, ఏఈ కుశాల్, వాటర్ వర్క్స్ ఇన్స్పెక్టర్ రమేష్, సర్సింహా, దుర్గ, టీఆర్ఎస్ నాయకులు సిద్ధార్థ్ ముదిరాజ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
వికలాంగులకు ఉపకరణాల పంపిణీ
వికలాంగులు ఉచిత పరికరాల పంపిణీ సద్వినియోగం చేసుకోవాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్లో జీహెచ్ఎంసీ, అలింకో సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పరికరాల పంపిణీ కార్యకమ్రం చేపట్టారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌడ్ వికలాంగులకు ఉచిత ఉపకరణాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన వికలాంగులు ఆధార్, రెండు పాస్‌పోర్ట్ ఫోటోలు తీసుకుని వచ్చి ఉచిత ఉపకరణాలను తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు డీపీవో రజిత, ఏఎంహెచ్‌వో జ్యోతిభారు, అంబర్‌పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.