Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-అడిక్‌మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం గాంధీనగర్ డివిజన్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి అశోక్‌నగర్ చౌరస్తా వరకు స్టీల్ బ్రిడ్జి, రోడ్డు పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రజలు సాఫీగా ప్రయాణం కొనసాగించాలని స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనుల వల్ల పాడైన రోడ్లను ప్యాచ్ వర్క్ లు చేయించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు రాకేష్ కుమార్, స్టీల్ బ్రిడ్జి నిర్మాణ అధికారులు ఈఈ గోపాల్, డీఈ సుదర్శన్, ఏఈ సాయి కష్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముఠా నరేష్, డివిజన్ ప్రధాన కార్యదర్శి పోతుల శ్రీకాంత్, ముచ్చకుర్తి ప్రభాకర్, పున్న సత్యనారాయణ, ఆకుల శ్రీనివాస్ మారిశెట్టి నర్సింగరావు, ఎర్రం శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివద్ధికి అత్యధిక నిధులు
ముషీరాబాద్ నియోజకవర్గం అభివద్ధికి అత్యధిక నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం కవాడిగూడ డివిజన్ చిత్రాల నగర్ బస్తీలో రూ.11 లక్షలతో షాబాద్ బండల ఫ్లోరింగ్ పనులను స్థానిక కార్పొరేటర్ రచన శ్రీ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కవాడిగూడ డివిజన్లో శిథిలావస్థకు చేరిన బస్తీ రోడ్డు పనులకు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దష్టిలో ఉంచుకుని వరదనీరు రోడ్డుపై నిల్వకుండా గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జై సింహ, డివిజన్ అధ్యక్షులు శ్యామ్ యాదవ్, మచ్చకుర్తి ప్రభాకర్, రాజశేఖర్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, రామచందర్, బిజెపి డివిజన్ అధ్యక్షులు మహేందర్, సలంద్ర శ్రీనివాస్ యాదవ్, వెంకటేష్, రమేష్ గౌడ్, సురేష్, ప్రకాష్, లింగం, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.