Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండేకంటి న్యాయ కళాశాల ఆచార్యులు డాక్టర్.డి.టి.మోహన కష్ణ
నవతెలంగాణ-ధూల్‌పేట్
'భూమిపై ఉన్న ఇతర జీవాల కంటే భిన్నంగా మనిషి తన సజనాత్మకతను, ఆలోచనను ఉపయోగించి మానవాళికి అవసరమైన వైజ్ఞానిక ఆవిష్కరణలనెన్నింటినో కనుగొన్నాడు. మనిషి సజనాత్మకతతో తన సౌకర్యంకోసం, సౌలభ్యంకోసం వివిధ ఉత్పత్తులను తయారు చేశాడు. పూర్వ, మధ్యయుగాలలో ఇలాంటి ఆవిష్కరణలు ప్రజల ఉమ్మడి ఆస్తిగా ఉండేవి. ఎవరైనా ఎలాంటి పరిమితులు, మినహాయింపులు, చెల్లింపులు లేకుండా వీటిని ఉపయోగించేవారు. కాలక్రమేణా, ఈ ఆవిష్కరణలకు ప్రాముఖ్యత, విలువ పెరిగి, ఆధునిక సమాజ అభివద్ధిలో మేధో సంపత్తి కీలకమైందిగా మారింది. ఈ విషయమై భారత ప్రభుత్వం కూడా క్రియేటివ్ ఇండియాబీ ఇన్నోవేటివ్ ఇండియా నినాదం మేధో సంపత్తి హక్కులపై అవగాహన కల్పిస్తున్నది.' ఈ నేపథ్యంలో ప్రభుత్వ సిటీ కళాశాల ఐక్యూయేసి విభాగం మేధోసంపత్తి హక్కులపై కళాశాల అధ్యాపకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.బాలభాస్కర్ అధ్యక్షోపన్యాసంలో అధ్యాపకులు తమ బోధనకు, పరిశోధనకు సంబంధించి ఈ విషయంపై అవగాహన అవసరాన్ని సూచించారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న పెండేకంటి న్యాయ కళాశాల ఆచార్యులు డాక్టర్.డి.టి.మోహన కష్ణ మేధో సంపత్తి హక్కుల గురించి అవగాహన కల్పించారు. ఆధునిక సమాజ అభివద్ధిలో మేధో సంపత్తి కీలకం అన్నారు. పేటెంట్లు, సాంకేతిక ఆవిష్కరణకు పేటెంట్, పేటెంట్ రక్షణ ప్రక్రియ, ట్రేడ్‌మార్క్, కాపీరైట్లు, బ్రాండ్లు, లోగోల కోసం ఎలా రక్షించబడతాయి అనే అంశాలను వివరించారు. హక్కుల బదిలీ తదితర అంశాలపై అధ్యాపకులు, పరిశోధకులు, ఆవిష్కర్తలకు ఉండే హక్కులు, అవకాశాల ను తెలిపారు. కళాశాల అధ్యాపకురాలు డా.జె.నీరజ సమన్వయకర్తగా సాగిన ఈ కార్యక్రమంలో అధ్యాపక బందం పాల్గొని తమ సందేహాలను నివత్తి చేసుకున్నారు.