Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు నిందారోపణలు చేస్తున్నారని, అది వారి విజ్ఞతకే వదిలేయాలని ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు అన్నారు. మంగళవారం బాలానగర్ డివిజన్లో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో కలిసి వివిధ అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా ఇంద్రానగర్ వద్ద నిరుపేదలకు ఉపయోగపడే రూ.5 భోజనం అన్నపూర్ణ క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం బస్తీలో పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే చెరబండరాజు కాలనీలో రూ. 50 లక్షలతో కమ్యూనిటీ హాల్, కల్యాణ్ నగర్ పార్క్‌లో రూ.54 లక్షలతో ఇండోర్ షటిల్ కోర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించడమే కాకుండా, యువతకు, క్రీడలను ప్రోత్సహించే విధంగా ఇండోర్ స్టేడియంలు, షటిల్ కోర్టు నిర్మాణాలు, పార్కులను అభివద్ధి చేస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే తమ కార్యాలయాన్ని సంప్రదిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ప్రజలకు సూచించారు. అభివద్ధి విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని, దాని కోసం ఎన్ని నిధులు కేటాయించడానికైనా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 60 ఏండ్లలో జరగని పనులు తెలంగాణ రాష్ట్రం సాధించాక ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయని ప్రజలు గమనించి అభివద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విపక్షాలు ఏం సాధిస్తాయో వారి విజ్ఞతకే తెలియాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.