Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్
నవతెలంగాణ-అంబర్‌పేట
రోడ్డు మరమ్మతుల పనులు త్వరగా పూర్తి చేయాలని హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ అన్నారు. మంగళవారం హిమాయత్‌నగర్ డివిజన్ సంజరు గాంధీ బస్తీలో రెండు రోజులుగా విరిగిపోయి ఉన్నా రహదారిని మున్సిపల్ అధికారులకు పిలిచి దాన్ని మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్లో పెండింగ్‌లో ఉన్న రోడ్ల సమస్యలను త్వరలోనే పరిష్కారం అయ్యేవిధంగా అధికారులు చూడాలని కోరారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, డీఎంసీ వేణుగోపాల్, దివ్య, శివ, బీజేపీ రాష్ట్ర నాయకులు జి. రామన్ గౌడ్, ప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్ ముదిరాజ్, మహేష్, జైస్వాల్, మీసాల సాయి తదితరులు పాల్గొన్నారు.