Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కష్ణయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
బీసీ కార్పొరేషన్ రుణాలు వెంటనే మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం విద్యానగర్ బీసీ భవన్లో రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు అనంతయ్య అధ్యక్షతన బీసీ కుల నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్.కష్ణయ్య హాజరై మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సబ్సిడీ రుణాల కోసం ఐదేండ్ల కిందట 5 లక్షల 77 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, ప్రతి దరఖాస్తుదారునికి రుణాలు ఇస్తామని సీఎం కేసీఆర్ వాగ్దానం చేశారు అని గుర్తు చేశారు. రాష్ట్రంలో 60 లక్షల బీసీ కుటుంబాలు ఉంటే ప్రచారం లేక కేవలం 5 లక్షల 27వేల మంది మాత్రమే బీసీ రుణాలకు దరఖాస్తు చేసుకున్నారని వారికి కూడా రుణాలు ఇవ్వరా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి రుణాలు ఇవ్వాల్సిందేనని అన్నారు. 'ప్రస్తుతం రాష్ట్రంలో 12 బీసీ కులాలకు ఫెడరేషన్లు ఉన్నాయని, వీటిని కార్పొరేషన్లగా మార్చాలని కోరారు. సమావేశంలో గుజ్జ కష్ణ, నీల వెంకటేష్, కూనూరు నర్సింహ గౌడ్, వేముల రామకష్ణ, చంటి ముదిరాజ్, భాస్కర్, రవీందర్, గంగనబోయిన రాంబాబు, దీపిక బిల్లా, సంగు లక్ష్మి, సుచిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.