Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగల్ రావు నగర్ డివిజన్లోని ముగ్గురు దళిత బంధు లబ్దిదారులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్థానిక కార్పొరేటర్ దేదీప్య రావుతో కలిసి స్థానిక కష్ణకాంత్ పార్కు వద్ద కార్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో నియోజకవర్గానికి 100 మంది దళితులను ఎంపిక చేసి దళిత బంధు ద్వారా ఉపాధి కల్పించి, వారు సమాజంలో గౌరవంగా జీవించేలా చేశారని సీఎం కేసీఆర్ను అభినందించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కోనేరు అజరు, ప్రధాన కార్యదర్శి వేణు, శ్యామరావు, విజయ ముదిరాజ్, జీటీఎస్ టెంపుల్ చైర్మెన్ చిన్న రమేష్, సత్యనారాయణ, పవన్, తదితరులు పాల్గొన్నారు.