Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తమను రెగ్యులర్ చేయాలని ఓయూ కాంట్రాక్టు అధ్యాపకులు మంగళవారం ఓయూ వీసీ, రిజిస్ట్రార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అంతకుముందు వారు ర్యాలీ చేపట్టి, పరిపాలన భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కొన్నేండ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసిన తర్వాతే యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ బోర్డ్ ద్వారా నియమాలను చేపట్టాలని చెప్పారు. జీఓ నెంబర్ 16 ప్రకారం తమను రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఓయూ క్యాప్ అధ్యక్షుడు డా.ధర్మాతేజ, ఓయూ ఔట సి అధ్యక్షుడు డా.పరశురాం, డా.ప్రేమయ్య, డా.పండయ్య, డా.వినిత్, డా.కవిత, డా.వెంకటేశ్వర్లు, డా.ఓ.కష్ణయ్య, డా.మోహన్, కాంట్రాక్టు అధ్యాపకులు పాల్గొన్నారు.