Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
కాళ్ల వెనుకభాగం నుంచి గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో ఏర్పడిన కణితిని బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రి వైద్యబృందం విజయంతంగా తొలగించింది. మంగళవారం కేర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. బిపిన్ గోయల్, నెఫ్రాలజీ వైద్యుడు డా. విక్రాంత్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. 2016లో మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న మహిళ (38) కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నారు. కాగా, గత కొంతకాలంగా పొత్తికడుపులో నొప్పితో బాధపడుతున్న ఆ మహిళ కేర్ ఆస్పత్రి వైద్య నిపుణులు సంప్రదించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అత్యంత అరుదైన 'ఇన్ఫీరియర్ వెనా కావాసర్ కోమా' అనే సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. కాళ్ల వెనుక భాగం నుంచి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన సిరా రక్తనాళంలో కణితి ఏర్పడటంతో గుండెకు రక్తం సరఫరా సరిగాలేకపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు. ఇలాంటి సమస్య గతంలో ఎవరికీ ఎదురు కాకపోవడంతో సవాల్‌గా స్వీకరించిన కేర్ వైద్య బందం సర్జరీ ద్వారా కణితిని విజయవంతంగా తొలిగించారు. సర్జరీ అనంతరం రోగి పూర్తిగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఇలాంటి సర్జరీ దేశంలోనే తొలిసారిగా చేశామని వారు పేర్కొన్నారు. సమావేశంలో కేర్ హెచ్సీవోవో డా.రాహుల్ మెదక్కర్, డా. గోపాల్ తదితరులు పాల్గొన్నారు.