Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షపునీటిలో కలుస్తున్న డ్రయినేజీ
- రోడ్డుపై ఏరులై పారుతున్న వైనం
- ఏండ్లుగా ఇదే పరిస్థితి..!
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-మల్కాజిగిరి
రోడ్డుపై డ్రయినేజీ నీరు పారుతున్నా పట్టించుకునే నాథుడే లేదు. మల్కాజిగిరి సర్కిల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టణ ప్రగతి అంటూ డివిజన్లోని కాలనీలు, బస్తీలను చుట్టి వస్తూ ఫోటోలు దిగి ఆర్భాటం చేశారే తప్పా.. పట్టణ ప్రగతి వల్ల ఎలాంటి ఉపయోగమూ లేకుండా పోయింది. ఫోటోలు దిగి వెళ్ళటానికి ఇచ్చిన ప్రాధాన్యత మురుగు పరుగును ఆప డానికి ఇవ్వలేదని స్థానిక ప్రజలు అంటున్నారు. గౌతం నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామాంజనేయ నగర్, జై నల్ల పోచమ్మ టెంపుల్ వద్ద మురుగునీరు ఏరులై పారుతోంది. ఏండ్లుగా ఈ సమస్య ఉన్నప్పటికీ అధికా రులు పట్టించుకోకపోవడం, సమస్యలను పరిష్కరించక పోవడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. వర్షం నీళ్ళు, డ్రయినేజీ మురుగునీరు కలిసి రోడ్డుపై ఏరులై పారుతుందనీ, కొన్ని రోజులుగా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. పాఠశాలలు ప్రారంభం కావడబతో పిల్లలను ఉదయం, సాయంత్రం స్కూల్కు తీసుకెళ్లేటప్పుడు, తీసుకొచ్చేటప్పుడు భయాందోళన చెందుతున్నట్టు చెబుతున్నారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వాహనాలపై వెళ్తున్నామనీ, ప్రమాదం అంచనా ప్రయాణిస్తున్నట్టు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలనీ, కాలనీలోని రోడ్డు మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలం రావడంతో చినుకు పడితే చిత్తడిగా మారి, పెద్ద గుంతలుగా ఏర్పడి, బురదమయంగా తయారై నానా అవస్థలు పడుతున్నామని వాహనదారులు, స్థానిక కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు వరద మురుగనీటితో కలిసి ప్రవహిస్తుం డటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నా యనీ, దశాబ్దాలుగా రోడ్డు, డ్రయినేజజీ సమస్య వేధిస్తు న్నా అధికారులు లు పట్టించుకోవడం లేదనీ, ఇండ్ల ముందు, గుడి ముందు, వారాల తరబడి పారుతున్న రోగాల భారీ పడిపోతున్నామని చెబుతున్నారు. పట్టణ ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు వర్షాలు వచ్చేలోపులో రోడ్డు పనులు పూర్తి చేస్తామని చెప్పినా.. ఇప్పటివరకు అతీగతి లేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా స్పందించి బోనాల సమయానికి పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఏండ్లుగా ఇదే సమస్య.. నిత్యం అవస్థలే..
ఏండ్లుగా ఇదే సమస్యతో నిత్యం అవస్థలు పడుతూ, రోడ్డుపై మురుగు నీరు వారాల తరబడి పారుతుండ టంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వరద, మురుగు కలిసి ఇండ్ల ముందు వారాల తరబడి పారుతూ రోగాల బారిన పడుతున్నాం. పిల్లలను పాఠశాల నుంచి తీసుకురావాలంటే భయబ్రాంతులకు గురవుతున్నాం. ముఖ్యంగా రోడ్డు సమస్య ఏండ్లుగా ఉంది. మట్టి రోడ్డు కావడంతో వర్షాకాలం రావడంతో వచ్చిన నీరు మొత్తం ఇండ్లల్లోకి ప్రవేశిస్తుంది. వచ్చే బోనాల పండుగ నాటికైనా అధికారులు, కార్పొరేటర్ స్పందించి సమస్యను పరిష్కరించాలి.
- స్థానిక కాలనీవాసి, అచ్చయ్య
సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం
శ్రీ రామాంజనేయ నగర్ పరిధిలో డ్రయినేజీ పొంగి పొర్లుతున్నా, రోడ్లు పలు సమస్యలను ఎప్పట ికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోక పోవడం శోచనీయం. ఇప్పటికైనా అధికారులు స్పం దించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. బోనాల పండగా వచ్చే నాటికి రోడ్డు, డ్రయి నేజీ సమ స్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం.
- మేకల సునీత రాము యాదవ్, గౌతమ్ నగర్ కార్పొరేటర్