Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి కేశపాగా రాంచందర్ మాదిగ
నవతెలంగాణ-మేడ్చల్
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వందరోజుల్లో బిల్లు పెడతామని, మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం పూర్తి మెజారిటీ ఉన్నా కూడా చట్టబద్ధత కల్పించడం లేదనిఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి కేశపాగా రాంచందంర్ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని మేడ్చల్ - నాగపూర్ జాతీయ రహదారిపై ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వర్గీకరణ చేయకుండా తెలుగు నేలపై అధికారం అనేది కలగానే మిగులుతుందన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్న సందర్భంగా వర్గీకరణ అంశంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షులు బచ్చలికూర స్వామి, ఎంఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు తోకల చిరంజీవి మాదిగ, ఎమ్మార్పీఎస్ మేడ్చల్ జిల్లా కన్వినర్‌గా పంగ ప్రణరు మాదిగ, మేడ్చెల్ కో కన్వీనర్ వడ్డేపల్లి శివ మాదిగ, మండల అధ్యక్షులు దబిలీపురం పరుశరాం, జిల్లానాయకులు ఏరువల్లి బాలనర్సింహ మాదిగ, కళామండలి జిల్లా అధ్యక్షులు రాంచందర్ మాదిగ, బాలెంల ప్రేమ్ మాదిగ, స్థానిక నాయకులు జీడిపల్లి శివమాదిగ, ఎర్రోళ్ల నర్సింగ్, తుడం రమేష్ మాదిగ, డి. స్వామి మాదిగ, డప్పు మహేందర్, ఏర్రోల్ల మహేందర్, ఎర్రోళ్ల శ్రీకాంత్ జోగుల వినయకుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు