Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30, 31వ డివిజన్లో నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులు, నిర్మాణపు అభివృద్ధి పనులపై కార్పొరేటర్లతో శనివారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గోపాల్ రెడ్డి అధ్యక్షతన కార్పొరేషన్ కార్యాలయంలో 13 వ డివిజన్ కార్పొరేటర్ ఆవుల పావని, 30వ డివిజన్ కార్పొరేటర్ కొలను మీనా సునీల్ రెడ్డి, 31వ డివిజన్ కార్పొరేటర్ ఆవుల ప్రసన్న జగదీష్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్.ఈశంకర్ లాల్, సీపీ శ్రీనివాస్, మేనేజర్ చంద్ర ప్రకాష్, శానిటేషన్ ఇన్చార్జి వినోద్ కుమార్, వాటర్ వర్క్స్ సాయి రాంరెడ్డి, హార్టికల్చర్ డైరెక్టర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, సైట్ ఇంజినీర్లు, శానిటేషన్ హెడ్స్, సెక్షన్ హెడ్స్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.