Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
దేశాన్ని అమ్మడమే మోడీ పని అని ఓయూ జేఏసీ నేతలు ఆరోపించారు. గో బ్యాక్ మోడీ గో బ్యాక్, బారు బారు మోడీ భారు భారు అంటూ నినాదాలు చేశారు. శనివారం ఓయూ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో ఉన్న అన్ని యూనివర్శిటీల్లో చదివే బీసీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థులకు ఏ ఫెలోషిప్ రాకుండా రద్దు చేసింది మోడీ అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోడీ ఉన్న ఉద్యోగాలను ప్రయివేటీకరణ చేశాడన్నారు. ప్రభు త్వ రంగ సంస్థలను ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నా డన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఒక్క కేంద్ర స్థాయి సంస్థను ఏర్పాటు చేయకపోవడం ఈ రాష్ట్ర ప్రజలపై నిర్లక్ష్యం కాదా? అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రంలో అధికారమే ఆకాంక్షగా జాతీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు అని ప్రశ్నించారు. స్మార్ట్ ఇండియా పేరుతో దేశాన్ని కార్పోరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న మోడీ ఇంకా కొనసాగితే ఈ దేశం త్వరలోనే శ్రీలంక, అఫ్ఘనిస్థాన్ లా మారిపో తుందన్నారు. మోడీ ఖబర్దార్.. త్వరలోనే దేశం మొత్తం యువకులు, రైతులు, కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, మహిళలు, దళితులు, మైనారిటీలు అందరూ కలిసి మోడీకి బారు బారు చెప్పే సమయం ఆసన్నమైం న్నారు. అది తెలంగాణ నుంచే నాంది పలుకుతుందన్నారు. త్వరలోనే ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో దేశంలోని అన్ని యూని వర్శిటీల్లో మోడీ దేశ ప్రజలకు చేస్తున్న నష్టాలకు, వ్యతిరేక నిర్ణయాలను తెలియజేస్తూ సదస్సులు సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. మోడీని ఇంటికి పంపితేనే ఈదేశం బతికి బట్టకడుతుందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తొలి నుంచి నేటివరకు దళితులు, గిరిజనులపై జరిపిన దాడులు పది వేలకు పైనే అనీ, మత విద్వేషాలు, కులవిద్వేషాలు, దళితు లపై దాడులు, మైనారిటీలపై దాడులు, గిరిజనుల ఊచకోత, బీసీలకు ఉన్నత విద్య అందకుండా దూరం చేయడం, ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే ఈ దేశం మరో మత కల్లోలాల వేదికగా ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఈ దేశంలో రాకుండా ఉండాలంటే మోడీకి భారు భారు చెప్పాల్సిందే అన్నారు. ఈ సమావేశంలో ఓయూ జేఏసీ చైర్మెన్ మాందాల భాస్కర్, అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ, ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్, నాయకులు అశోక్ యాదవ్, హరీష్ గౌడ్, చిరంజీవి, గాంధీ నాయక్, అర్జున్ గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు.