Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిలా ఫలకాలకే పరిమితమైన మల్లారెడ్డి హామీలు
- కమీషన్లకు అలవాటుపడి అభివద్ధిని పట్టించుకోవడంలేదు
- డబుల్ బెడ్ రూంల డ్రాలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలి
- కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, బోడుప్పల్ మేయర్లు పూర్తి స్థాయిలో విఫలం అయ్యారని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. శనివారంనాడు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిం చారు. ఈ ధర్నా కార్యక్రమానికి తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిóగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలోనే నెంబరు వన్ కార్పొరేషన్ బోడుప్పల్ అంటూ గొప్పలు చెప్పడమే తప్ప కార్పొరేషన్ అభివద్ధికి మంత్రి మల్లారెడ్డి చేసిందేమీ లేదని వాపోయారు. నెలలో నాలుగైదుసార్లు బోడుప్పల్‌కు వచ్చే మంత్రి చేసిన ప్రారంభో త్సవాలు ఎన్ని, పూర్తి చేసిన పనులు ఎన్నో లెక్కలు తిద్దామా అని ప్రశ్నించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపిస్తే వక్ఫ్ భూముల సమస్యలు పరిష్కరిస్తానని ఆర్ఎన్ఎస్ కాలనీ బహిరంగ సభలో ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారో మల్లారెడ్డి సమాధానం చెప్పాల్సిన ఉందని అన్నారు.
మాట వినని కమిషనర్లను పంపించడమే వారి లక్ష్యం
తాము చెప్పిన మాట వినని కమిషనర్లను పంపించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల వ్యవహర శైలి ఉందని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, బోడుప్పల్ నగర అధ్యక్షుడు పోగుల నరసింహా రెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఏ పని చేసినా మొదట టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు కమీషన్ ముట్టచెప్పాల్సిందేనని, లేకపోతే ఏ పని కాకుండా అవాంతరాలు సష్టిస్తారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వైఖరి కారణంగానే కార్పొరేషన్లో అనేక అభివద్ధి పనులు నిలిచిపోయాయని మంత్రి మల్లారెడ్డి అట్టహాసంగా చేపట్టిన సమీకత మార్కెట్, సర్కారు ఆస్పత్రి భవనాల నిర్మాణం ఎప్పుడూ మొదలు పెడుతారంటూ ప్రశ్నించారు. డబుల్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ధనిక కార్పొరేషన్లో తాగునీటికి ఇక్కట్లా?
ధనిక కార్పొరేషన్ అని చెప్పే బోడుప్పల్లో ప్రజలు తాగునీరు లేక అల్లాడిపోతున్నారని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ బీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్‌గౌడ్ అన్నారు. కోట్లాది రూపాయలు పన్నులు వసూళ్ళు చేయడమే కానీ మౌలిక సదుపాయాల కల్పనపై ఎందుకు దష్టి సారించడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుర్రి శివశంకర్ మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో ప్రజాప్రతినిధులు అభివద్ధి పక్కన పెట్టి అక్రమ సంపాదనపై దష్టి సారించారని చెరువులు, పార్క్ స్థలాలు, ఎఫ్టీఎల్ స్థలాల్లో అక్రమ నిర్మాణాలను చేపడుతున్న వారికి సహకరించి లక్షల రూపాయల వసూళ్ళకు పాల్పడితున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ పోగుల నరసింహారెడ్డి, కార్పొరేటర్లు తోటకూర అజరు యాదవ్, కొత్త దుర్గమ్మ, బొమ్మకు కళ్యాణ్ కుమార్, పొద్దుటూరి శోభారాణి, మేడ్చల్ అసెంబ్లీ బీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్‌గౌడ్, పోగుల వీరారెడ్డి, బోడుప్పల్ ప్రధాన కార్యదర్శి కొత్త ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పొన్నం తరుణ్ గౌడ్, మేడ్చల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త సుశాంత్గౌడ్, నాయకులు కుర్ర శివశంకర్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుతోట గీతారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఎలగోని బాక్ రాజుగౌడ్, రాపోలు ఉపేందర్, రామగళ్ల చంటీ, ఉప్పగళ్ల ప్రశాంత్, అసర్ల బీరప్ప, తోటకూర మల్లేష్ యాదవ్, రాజు యాదవ్, చింతల శ్రీనివాస్‌రెడ్డి, ఫకీర్ హారీనాధ్రెడ్డి, సింగిరెడ్డి రాజిరెడ్డి, గణేష్ నాయక్, విశ్వం గుప్త, ఎలగందుల రాములు, అమరేందర్ రెడ్డి, దీలిప్ రెడ్డి, కుర్ర మహేష్, తోటకూర రాహుల్ యాదవ్, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేషన్ మేనేజర్ మంజులత కు వినతిపత్రం అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మేడిపల్లి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి అధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.