Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
కులమతాలకు అతీతమైన ఆత్మ అందరిలో ఉందని తెలిపే ఆత్మ యజ్ఞం అనే గొల్ల కలాపం నాట్య రూపకం ప్రబోధాత్మకంగా ప్రముఖ నాట్య గురువులు భాగవతుల సేతురాం, రమా దేవి బృందం ప్రదర్శించారు. రవీంద్రభారతి ప్రధాన వేదికపై శ్రీ సాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ నిర్వహణలో భాగవతుల రామ కోటయ్య రచించిన గొల్ల కలాపం భారతీయ సంప్రదాయ గురుపరంపర విధానంలో రెండు తరాల వారు పాల్గొన్నారు. భాగవతుల సేతురాం, పుత్రుడు మోహిత్ విప్రుని గా, డాక్టర్ రమాదేవి, పుత్రిక ప్రత్యూష గొల్లభామగా ఆమె కుమారుడు వేదాంత వినాయక పాత్రలో పూర్వ్య రంగ ప్రవేశం చేశారు. డాక్టర్ రమాదేవి నృత్య రూప దర్శకత్యంలో శేషుబాబు స్వర కల్పనలో పర్వ్యతీశం రచించిన అంశాలను డాక్టర్ అతీర, అక్షర, కృతిక, ధృతి, స్యమంత నర్తించారు. సేతురాం నట్టువాంగం చేయగా శ్వేతా ప్రసాద్, శ్రీనివాస్ ల గానం మధురం.రేణుకా ప్రసాద్ మృదంగంపై, సాయికుమార్ వాయు లీనంపై, ఉమా వెంకటేశ్వర్లు వేణువుపై, శ్రీధర్ ఘటంపై సహకార మందించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో డాక్టర్ రమాదేవి మాతృ ముర్తి మీనాక్షి అమ్మాళ్ పేరిట ఏర్పరచిన ప్రతిభా పురస్కారం ప్రముఖ ఆంధ్ర నాట్య గురువు కళా కృష్ణకు రూ.30 వేల నగదుతో సత్కరించారు.