Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
పర్యావరణాన్ని పరిరక్షించాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ ఇ. విజయ్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళ వారం అంబర్పేట డివిజన్ పరిధిలోని ప్రగతి స్కూల్లో మట్టి గణపతుల తయారీ రంగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకుల తయారీ రంగానికి ప్రభుత్వపరంగా వ్యక్తిగతంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎన్విరల్ మెంట్ అధికారి విజరు కుమార్, జీహెచ్ఎంసీ సిబ్బంది పాషా, ప్రగతి స్కూల్ చైర్మెన్ మధుసూదన్ ,ప్రతాప్, ఉమేష్, మహిళా సంఘాలు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.