Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తమను రెగ్యులరైజ్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్టు (సి) వారి ఆధ్వర్యంలో మంగళవారం నిజాం కళాశాల ఎదుట లంచ్ అవర్లో ఆందోళన నిర్వహించారు. నాలుగు రోజుల నుంచి నిత్యం ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. అధ్యక్షుడు డా.పరశురాం, వర్కింగ్ ప్రెసిడెంట్ డా. ధర్మాతేజ మాట్లాడుతూ ఓయూలో కాంట్రాక్టు అధ్యాపకులుగా సుదీర్ఘ సేవలు అందజేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో డా.పండయ్య, డా.తిరుపతి, డా.వెంకటేశ్వర్లు, డా.అనిత, డా.గాయత్రి, డా.సుమతి, కాంట్రాక్టు అధ్యాపకులు పాల్గొన్నారు.