Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
బస్తీ దవాఖాన పనులను త్వరగా ప్రారంభించాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజయకుమార్‌గౌడ్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని రఘునాథ్‌నగర్‌లో పర్యటించి బస్తీ దవాఖాన ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీ దవఖానా నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. బస్తీ దవాఖాన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో డీఈ దయానంద్ రెడ్డి, ఏఈ జగదీష్ ప్రసాద్, వర్క్ ఇన్స్పెక్టర్ దీపక్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు సంజరు ముదిరాజ్, వేణు. ప్రవీణ్, సంతోష్‌చారి తదితరులు పాల్గొన్నారు.