Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ అధికారుల విస్తృతస్థాయి ప్రచారం
నవతెలంగాణ-అడిక్మెట్
పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతిని పూజించాలని జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో విస్తృతస్థాయి ప్రచారం నిర్వహించారు. డీఎంసీ హరికృష్ణ, ముషీరాబాద్ సర్కిల్ జీహెచ్ఎంసీ ఏఎమ్హెచ్ఓ మైత్రేయి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారి నరసింహ చవితి పండుగ సందర్భంగా ఏకో ఫ్రెండ్లీ మట్టి గణపతినే పూజించాలని ప్రజలను కోరారు. మట్టి వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. కాలుష్యం లేని పర్యావరణ హితం కోరే ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎకో ఫ్రెండ్లీ మట్టి గణేశ్ ప్రతిమల తయారీపై ఆసక్తి ఉన్న వారికి సరిల్ వారీగా శిక్షణతో పాటు అవగాహన కల్పించినట్లు తెలిపారు. జోనల్ స్థాయిలో ఒకటి, సర్కిల్ స్థాయిలో రెండు ముఖ్య ప్రదేశాలు, వ్యాపార కూడలి, పెద్ద వాణిజ్య సంస్థల ఆవరణలో మట్టి విగ్రహాల ప్రతిమల ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు.