Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటర్బోర్డు ఎండీ దానకిషోర్
- సివరేజీ ప్లాంట పనులపై సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణంలో కార్మికుల రక్షణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని జల మండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. నగరంలో ఉత్పత్తయ్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,866. 21 కోట్లతో 31 కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ)ను జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తరుణంలో జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మా ట్లాడుతూ పనులు చేస్తున్నప్పుడు కార్మికులు కచ్చి తంగా రక్షణ పరికరాలను వినియోగించేలా చూడాల న్నారు. ఎస్టీపీ పనులు జరుగుతున్న ప్రాంగణాల చుట్టూ షటరింగ్ తప్పనిసరిగా చేయించాలని పేర్కొ న్నారు. సివిల్ వర్కులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇందుకు గానూ కార్మికుల సంఖ్యను ఇంకా పెంచాలని నిర్మాణ సంస్థలకు ఆదే శించారు. ఇప్పటికే కావాల్సిన మిషినరీకి ఆర్డర్ ఇచ్చి నందున, అనుకున్న సమయానికి మిషినరీ అందేలా చూడాలని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో తయార వుతున్న మిషనరీని జలమండలి ఉన్నతాధి కారులు స్వయంగా వెళ్లి పరిశీలించి రావాలని సూచించారు. ఎస్టీపీల నిర్మాణం జరుగుతున్న ప్రాంగణాల్లో నిర్మిం చనున్న కార్యాలయాలకు సంబం ధించిన డిజైన్లను వారం రోజుల్లో అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.