Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పరిధిలోని బీవీఆర్ఐటీ హైదరాబాద్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో 'ఎఫెక్టివ్ యూస్ ఆఫ్ సోషల్ మీడియా టూ ఈవెంట్ సైబర్ క్రైవ్'పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాదాపూర్ డివిజన్ డీసీపీ కల్పవల్లి, ఏసీపీ మియాపూర్ డివిజన్ కష్ణ ప్రసాద్ హాజరయ్యారు. సోషల్ మీడియా ఉపయోగించడంలో స్టూడెంట్లు అవలంభించాల్సిన జాగ్రత్తలను తెలియపరిచారు. డీసీపీ కల్పవల్లి మాట్లాడుతూ ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయని ఆందోళనవ్యక్తం చేస్తూ సైబర్ సైబర్ నేరాల్లో సోషల్ మీడియా వినియోగం ఏ విధంగా ఏ దుర్వినియోగం పరుస్తున్నారో వివరించారు. ఈ-మెయిల్ సైబర్ స్టాకింగ్, ఈమెయిల్ మార్ఫింగ్, హ్యాకింగ్ వాటి ద్వారా మహిళలు ఏ విధంగా వేధింపబడుతున్నారో వివరిస్తూ సైబర్ నేరాలకు గల వ్యతిరేక చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం క్యాంపస్‌లోని ఎన్ఎస్ఎస్ యూనిట్ అందరూ కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో బీవీఆర్ఐటీ ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎన్ సునీత, అధ్యాపకులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.