Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషియో రీఫార్మ్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ అలీం ఖాన్ ఫల్కీ
నవతెలంగాణ-ధూల్‌పేట్
వరకట్నం తీసుకోవడమంటే బిక్షమెత్తుకోవడమేనని సోషియో రీఫార్మ్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ అలీం ఖాన్ ఫల్కీ అన్నారు. గురువారం షాహీన్ నగర్లో జరిగిన సమావేశంలో వరకట్న దురాచారాలు-దుష్పరిణామాలు అంశంపై ఆయన మాట్లాడారు. పేదరికంలోకి నెట్టేస్తున్న వరకట్న మహమ్మారి ఆడ పిల్లల పెండ్లిండ్లు చేయడానికి ఎన్నో కుటుంబాలు దారిద్య్రంలోకి నెట్టివేయబడుతున్నాయన్నారు. మరెన్నో కుటుంబాలు అప్పుల ఊబిలోకూరుకుపోయి రోడ్డు పాలవుతున్నాయని ఆరోపించారు. వరకట్న దురాచారాన్ని కూకటి వేళ్లతో పెకిలిచించి వేసినప్పుడు పేద కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయని అన్నారు. వరకట్నం తీసుకోవడమంటే బిక్షమెత్తుకోవడంతో సమానమని, ఆడపెళ్లి వారింట విందు భోజనాలు డిమాండ్ చేయడం అత్యంత దిగుజారుడు చర్య అని అన్నారు. ఈ సందర్భంగా టైలరింగ్‌లో శిక్షణ పొందిన ముస్లిమ్ యువతులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. మౌలానా అబ్దుల్ కబీర్ ముస్లిమ్ యువతుల స్వయం ఉపాధి కోసం ఈ శిక్షణా కేంద్రాన్ని నడుపుతున్నారని అలీం ఖాన్ అన్నారు. టైలరింగ్, మెహందీ డిజైనింగ్ లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
సోషియో రీఫార్మ్ సొసైటీ చేపట్టిన వరకట్న నిర్మూలన ఉద్యమంలో పాల్గొనాలనుకునే వారు 99599 59008కు ఫోన్ చేయగలరని సొసైటీ జనరల్ సెక్రటరి అబ్దుల్ బారీ హుసైనీ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలోనైనా వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు, సింపోజియంలు నిర్వహించాలనుకునే వారు తమకు తెలియజేయాలని చెప్పారు.