Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
నవతెలంగాణ-బంజారాహిల్స్
సర్కార్ బడుల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు కృషిచేస్తున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా సోమవారం బంజారాహిల్స్ డివిజన్ ఉదరు నగర్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కార్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలనుసారంగా విద్యాలయాల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా ప్రత్యేక దష్టి కేంద్రీకరించిందన్నారు. బంజారాహిల్స్ ఒక్కటే కాదు ఖైరతాబాద్ నియోజకవర్గం మొత్తంలో సమస్యాత్మకంగా ఉన్న పాఠశాలలా విషయాలు తన దష్టికి తీసుకొచ్చిన వెంటనే పర్యవేక్షించి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బంజారాహిల్స్ డివిజన్‌కు చెందిన దళిత బంధు పథకం లబ్దిదారులు లత శ్రీనివాస్‌కు కారు అందజేశారు.