Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోలన్ శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ జర్నలిస్టు కాలనీ సమీపంలోని చెర్లఎల్లమ్మ తల్లి ఆలయాభివృద్ధికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోలన్ శ్రీనివాసరెడ్డి (కెఎస్ అర్) తెలిపారు. ఈనెల 24వ తేదీన అమ్మవారి బోనాలు నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ ధర్మకర్త అయిన శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కోలన్ శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు ముక్కర్ల లాలయ్య, ప్రధాన కార్యదర్శి కోలేపాక వెంకట్, ముఖ్య సలహాదారు నాగేంద్రచారి, ఉపాధ్యక్షుడు రాము యాదవ్, కార్యనిర్వాహక కార్యదర్శులు కృష్ణారావు, మారుతి కుమార్, శ్రీనివాసరావు పలువురు కమిటీ సభ్యులు ఉన్నారు.