Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనరజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల ఉప్పలయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
రజకులంతా ఒకే కులం, ఒకే సంఘంగా ఏర్పడాలని మన రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల ఉప్పలయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పెద్దఊరే బ్రహ్మయ్య అన్నారు. సోమవారం మన రజక సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో సొసైటీస్ యాక్ట్ ప్రకారం తెలంగాణలో 33 జిల్లాలోని కార్యవర్గంతో మన రజక సంఘం ఏర్పాటు చేసుకుని నిజాయితీగా నిబద్ధతతో పని చేస్తున్నాం అని తెలిపారు. ఒకే కుల సంఘం ఏర్పాటుకు మన రజక సంఘం సిద్ధంగా ఉందన్నారు. విధివిధానాలు రూపొందించుకుని ఒకే సంఘంగా ఉంటే ప్రభుత్వ నుంచి అన్ని సదుపాయాలు పథకాలు పొందవచ్చు అని చెప్పారు. 2018లోనే రాష్ట్ర రజకుల సంక్షేమం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి అవసరమైన 3 ఎకరాలు, రూ. 5 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 189,633లను మన రజక సంఘం కో ఆర్డినేటర్ పేరుతో జారీ చేసింది అని గుర్తుచేశారు. రజక జాతి ఆత్మ గౌరవ భవనం కోసం ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. ప్రభుత్వమే ఒక కమిటీని ఏర్పాటు చేసి రజక జాతి ఆత్మగౌరవ భవన్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ రాజు, చంద్రశేఖర్ మడివేలు, రాష్ట్ర మహిళా అధ్యక్షులు లావణ్య, శిరీష, అనురాధ, శనిగరాపురాజు, బొడ్డుపెళ్లి శేఖర్, నిమ్మల మల్లేష్, భూతరాజ్ గణేష్, పగిళ్ల వెంకటేష్, పీరయ్య మొగలి బాబు పాల్గొన్నారు.