Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమవారం యూసఫ్‌గూడ బస్తీ చౌరస్తాలో దళితబంధు లబ్దిదారులకు నాలుగు ఆటోలు, మూడు కార్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీలు సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలతో ఉపాధి కల్పించే మార్గాలను చూపిస్తూ ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, డివిజన్ అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి నరసింహదాస్ పాల్గొన్నారు.